హిందీ మార్కెట్‌లోకి 100కోట్ల సినిమాలతో అడుగుపెట్టిన నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోస్ వీరే:::
ప్రభాస్:-SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమా హిందీ వెర్షన్ 118.70కోట్ల రూపాయలు సంపాదించింది.2015లో విడుదలైన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి,అనుష్క శెట్టి అండ్ తమన్నా భాటియా కీలక పాత్రలలో కనిపించరు.ఆర్కా మీడియావర్క్స్,గ్రీన్ స్టూడియో,యువి క్రియేషన్స్,గ్లోబల్ యునైటెడ్ మీడియా అండ్ ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ అండ్ ప్రసాద్ దేవినేని నిర్మించారు.'బాహుబలి 2:ది కన్‌క్లూజన్' 500కోట్లకు పైగా వసూలు చేసింది.
అల్లుఅర్జున్:-టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ అండ్ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న నటించిన 'పుష్ప:ది రైజ్' హిందీ వెర్షన్ కూడా 100కోట్ల మార్కును క్రాస్ చేసింది.సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.
జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్:-SS రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'RRR' హిందీ వెర్షన్ కేవలం 5రోజుల్లో 100కోట్ల మార్కును దాటింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa