MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ సినిమాకి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ (గుంటూరు జిల్లా కలెక్టర్)గా నటిస్తున్నాడు.నితిన్ సరసన ఈ సినిమాలో కృతిశెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా 'మాచర్ల నియోజకవర్గం' సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా టీజర్‌లో నితిన్‌ని ఫుల్ యాక్షన్ మోడ్‌లో చూపించారు.పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కామాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాని ఆదిత్య మూవీస్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa