ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2022 ఏప్రిల్ లో విడుదలయ్యే తెలుగు సినిమాల లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 12:38 PM

మిషన్ ఇంపాజిబుల్:-గ్లామర్ బ్యూటీ  తాప్సీ పన్ను,స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నటిస్తున్న 'మిషన్ ఇంపాజిబుల్' సినిమా ఏప్రిల్ 1,2022న థియేటర్‌లలో విడుదల కానుంది.నిరంజన్ రెడ్డి అండ్ అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో తాప్సీ ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌గా నటిస్తోంది.
ఘని:-కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఘని' మూవీ ఏప్రిల్ 8,2022న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర,సునీల్ శెట్టి,జగపతి బాబు,నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
బీస్ట్:-నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్,పూజాహెడ్గే నటిస్తున 'బీస్ట్' సినిమా ఏప్రిల్ 13,2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో రిలీజ్ అవుతుంది.
KGF2:-ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించగా,శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది.ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.
ఆచార్య:-టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య" సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 29,2022 రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్ అండ్ పూజ హెడ్జ్ నటిస్తున్నారు.మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించారు.
అశోక వనంలో అర్జున కళ్యాణం:-విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా ఏప్రిల్ 22న విడుదల కానుంది.
జయమ్మ పంచాయతీ:- ప్రముఖ యాంకర్  సుమ నటించిన 'జయమ్మ పంచాయతీ'  ఏప్రిల్ 22న విడుదలవుతోంది.
కృష్ణ బృందా విహారి:-యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య 'కృష్ణ బృందా విహారి' అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో ఏప్రిల్ 22,2022న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన షిర్లీ సెటియా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఐరా క్రియేషన్స్‌పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa