ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్‌కి భారీ డీల్ ని ఆఫర్ చేసిన బాలీవుడ్ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:23 PM

టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఇప్పుడు ముంబైలోని ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ రామ్ చరణ్‌కు రెండు సినిమాల కాంట్రాక్ట్‌ను ఆఫర్ చేసినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డీల్ కోసం భారీ రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. మరి రానున్న రోజుల్లో ఈ ఆఫర్ ని రామ్ చరణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ తో 'RC15' సినిమా షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa