పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో రానున్న సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. మారుతీ ఈ సినిమా స్క్రిప్టింగ్‌లో ఆసక్తికరమైన సబ్జెక్ట్‌ను రెడీ చేశాడు అని వెల్లడించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, 'రాజా డీలక్స్' సినిమాలో ప్రభాస్ సరసన బబ్లీ బ్యూటీ అనుష్కశెట్టి నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రామా నాయుడు స్టూడియోస్‌లో ప్రారంభించనున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో మారుతీ వెల్లడించారు. ప్రస్తుతం మారుతీ స్టార్ హీరో గోపీచంద్‌తో 'పక్కాకమర్షియల్' మూవీ పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa