ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పంచతంత్రం' తదుపరి పాటను లాంచ్ చేయనున్న విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 06:12 PM

హర్ష పులిపాక  దర్శకత్వంలో వస్తున్న 'పంచతంత్రం' సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ అండ్ నరేష్ అగస్త్య ఈ సినిమాలో నటిస్తున్నారు. అఖిలేష్ వర్ధన్ అండ్ సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రంలోని రెండో పాటను టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 'అరేరే అరేరే' అనే టైటిల్‌తో ఈ పాట ఏప్రిల్ 4, 2022న ఉదయం 11:11 గంటలకు విడుదల కానుంది. ఎస్ ఒరిజినల్స్ అండ్ టికెట్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa