ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు : చిరంజీవి

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 10:17 PM

తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన సినిమా  'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సినిమాకి స్వరూప్ ఆర్‌ఎస్‌జె దర్శకత్వం వహిందడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడ్తూ పెద్ద సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదన్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదని.. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్లు ఈ సినిమాలో భాగమైనప్పుడే ఇలాంటి సినిమాలకు పబ్లిసిటీ వచ్చిందని.. ఇలాంటి సినిమాలు తెలుగు సినిమా సత్తాను ఇండియన్ బాక్స్ వద్ద చాటుతున్నాయని చిరు అన్నారు. చిన్న సినిమాలను కూడా ఆదుకోవడం తమ బాధ్యతగా భావించాలని పరిశ్రమ వారికి పిలుపునిచ్చారు.పింక్, బద్లా వంటి చిత్రాల్లో తాప్సీ అద్భుతమైన నటనను కనబర్చిందన్నారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందించాడు. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ  సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa