గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్‌గా #NBK 107 ప్రాజెక్ట్ పేరుతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి మేకర్స్ ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల 2న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ చిత్రం మొదటి గ్లింప్స్‌ను విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోందని, మేకర్స్ ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉన్నారని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa