ఇటీవలే శివకార్తికేయన్ తో వరుణ్ డాక్టర్ సినిమా తీసి ఘనవిజయం అందుకున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం బీస్ట్. తమిళ స్టార్ హీరో విజయ్, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విజయ్ నటించిన తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాలనందుకుంటున్నాయి. దీంతో ఈ సారి బీస్ట్ సినిమాను తెలుగు,తమిళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది బీస్ట్ చిత్రయూనిట్. ఈ క్రమంలో ట్రైలర్ కు కూడా ముహూర్తమ ఫిక్స్ చేసారు. ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరో విజయ్ వీరరాఘవన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa