ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజాంలో 'RRR' మొదటి వారం కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 10:13 AM

సెన్సషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తుంది. ఈ భారీ చిత్రంలో అలియాభట్ అండ్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. నైజాం డిస్ట్రిబ్యూటర్లు 75 కోట్లుకి ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా సినిమా నైజాంలో 7వ రోజు 3.3 కోట్లు వాసులు చేసింది. దీంతో ఈ సినిమా విడుదలైన తొలి వారంలో 73 కోట్లు రాబట్టింది. ఈ పాన్-ఇండియన్ చిత్రంలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. డివివి దానయ్య ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa