ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ స్టార్ హీరో 'టైగర్ నాగేశ్వరరావు' కి ఫస్ట్ ఛాయిస్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 04, 2022, 12:02 PM

వంశీ దర్శకత్వంలో  టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనాన్ అండ్ ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించనున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ దర్శకుడు వంశీ తనకు మొదట స్క్రిప్ట్ చెప్పారని, అయితే వ్యక్తిగత కారణాల వల్ల తను ఈ సినిమా చేయలేనని అన్నాను అని చెప్పారు. ఈ యాక్షన్ డ్రామాలో రవితేజ నటించడం నాకు చాలా సంతోషంగా ఉందని చిరు అన్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa