యంగ్ హీరోనితిన్ తాజగా నటిస్తున్న మూవీ శ్రీనివాస కళ్యాణం.‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా రాశీఖన్నా, నందిత శ్వేతలు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఎపిలోని అమలాపురంలో కొనసాగతున్నది.. ఈ మూవీలో రాశీ ఖన్నా చక్కటి చీరకట్టుతో నటిస్తున్నది.. ఆ డ్రస్ లో ఉన్న ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది రాశీఖన్నా..అమలాపురంలో జరుగుతున్న షెడ్యూల్ పై ఆమె స్పందిస్తూ, నా గోల్ ని చేరుకునేందుకు నిరంతరం ప్రయాణిస్తూనే ఉన్నా.. ఈ ప్రయాణంలో శ్రీనివాస్ కళ్యాణం మూవీ కోసం అమలాపురంలో జరిగిన షూటింగ్ అనేక మరపురాని మధురానుభూతులను మిగిల్చింది అంటూ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa