ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తెలుగు స్టార్ హీరోతో కలిసి నటించాలనుకుంటున్నాను- షాహిద్ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 02:30 PM

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటించిన "జెర్సీ" సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నా విషయం తెలిసిన సంగతే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నఈ రీమేక్ లో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. తాజాగా 'జెర్సీ' మూవీ మేకర్స్  ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన తర్వాత షాహిద్, మృణాలీ ఠాకూర్ అండ్ జెర్సీ టీమ్ నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ మీడియా ఇంటరాక్షన్ లో సౌత్ ఇండియా హీరోస్ లో ఎవరితో కలిసి నటించాలని అనుకుంటున్నారు అని అడిగినపుడు.... అల్లు అర్జున్‌తో కలిసి నటించాలనుకుంటున్నాను అని ఈ స్టార్ హీరో సమాధానమిచ్చాడు. 'పుష్ప' లోని శ్రీవల్లి పాట కు అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ చేయాలనుకుంటున్నట్లు షాహిద్ వ్యక్తం చేశాడు. దిల్ రాజుతో కలిసి అల్లు అరవింద్, నాగ వంశీ, బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సచేత్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa