బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అండ్ గ్లామర్ బ్యూటీ అలియా భట్ డేటింగ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వీరి పెళ్లి గురించిన చాలా వార్తలు వైరల్‌గా మారాయి కానీ ఇప్పటి వరకు కంఫర్మ్ చేయలేదు. గత కొన్ని రోజులుగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరిద్దరి పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ నెల 17న రణబీర్ కపూర్ అండ్ అలియా భట్ సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. డిసెంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉండగా సడన్‌గా ప్రీపోన్డ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లి వార్తలపై అలియా అండ్ రణబీర్ ఇద్దరు స్పందించలేదు. రానున్న రోజులలో ఏమి జరగనుందో వేచి చుడాలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa