యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ నటిస్తున రొమాంటిక్ డ్రామా "18 పేజెస్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆడియన్స్ ని ఫుల్ ఎట్రాక్ట్ చేసింది. కానీ కరోనా మరియు లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం గురించి అప్‌డేట్‌లు లేకపోవటంతో సినిమా ప్రేమికులకు మరియు ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. పల్నాటి సూర్య ప్రతాప్ మెగాఫోన్‌ని నిర్వహిస్తుండగా, గోపీ సుందర్ సంగీతం సమకూర్చారు. ఈ రొమాంటిక్ డ్రామా జూన్ 17న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజా అప్డేట్ ప్రకారం, '18 పేజెస్' మేకర్స్ ఈ సినిమా గ్లింప్సె ని ఏప్రిల్ 6, 2022న సాయంత్రం 06:03 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ప్రకటించేందుకు '18 పేజెస్' టీమ్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాని GA2 పిక్చర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa