తమిళ హీరో విజయ్ నటించిన 'బీస్ట్' చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజైంది. భారత గూఢచారి వీర రాఘవగా విజయ్ విశ్వరూపం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. సన్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో అత్యంత భారీతనంతో 'బీస్ట్' రూపుదిద్దుకుంది. ఇందులో స్పై పాత్రలో విజయ్ చేసే సాహసాలు ప్రేక్షకులకు కొత్త థ్రిల్ కలిగిస్తాయి. ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయిక. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. 'బీస్ట్' చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్ లే, బార్న్ సరావో తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa