తమిళ యంగ్ హీరో నటించిన FIR చిత్రానికి తెలుగులో సహా నిర్మాతగా మాస్ రాజా రవితేజ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఓటిటిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ బంధాన్ని కొనసాగిస్తూ విష్ణు విశాల్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కు కూడా తెలుగులో సహా నిర్మాతగా మారిపోయాడు మాస్ రాజా.
తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా అయ్యవు దర్శకత్వం వహిస్తుండగా, విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీం వర్క్స్ బ్యానర్ పై రవితేజ, విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ మూవీ మోషన్ పోస్టర్ తో పాటు టైటిల్ ను కూడా తెలుగు,తమిళ భాషలలో ఎనౌన్స్ చేసారు. తెలుగు మోషన్ పోస్టర్ ని రవితేజ విడుదల చేసారు. తెలుగులో ఈ సినిమాకు మట్టి కుస్తీ టైటిల్ ని ఖరారు చేసారు. ఆసక్తిని రేకెత్తిస్తున్న మోషన్ పోస్టర్ లో విష్ణు మల్లయోధుడిలా కనిపించారు. స్రవంతి సాయినాధ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రవితేజ యాడ్ అవటంతో ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ అతిథి పాత్రలో మెరిసే అవకాశం ఉందని ఊహాగానాలు వినబడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa