ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెమ్యునరేషన్ పెంచేసిన బెంగళూరు బ్యూటీ శ్రీ లీల

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:12 PM

వక్కంతం వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'జూనియర్' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. పక్కా కమర్షియల్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో బెంగళూరు బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం, శ్రీలీలా ఈ సినిమా కోసం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.'పెళ్లి సందడి' మూవీకి ఈ బెంగళూరు బ్యూటీ 5 లక్షలు తీసుకోగా, కానీ ఇప్పుడు నితిన్ 32 సినిమాకి ఏకంగా 1.25 కోట్లు డిమాండ్ చేస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మేకర్స్ కూడా  చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని లేటెస్ట్ టాక్. ఆదిత్య మూవీస్‌ అండ్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa