ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ తేజ్ లు కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రేయా శరణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 25న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. దాదాపు వెయ్యి కోట్లకు చేరువలో ఈ సినిమా కలెక్షన్లు ఉండటంతో చిత్రబృందం ఆనందం గా ఉంది.
దేశం నలుమూలల ఉన్న సినీ ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, బయట కానీ హాట్ టాపిక్ ఏంటంటే ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా అంత కలెక్ట్ చేసింది... అక్కడ రికార్డు క్రియేట్ చేసింది... అనే వార్తలను రోజూ వింటూనే ఉన్నాం. అయితే సినిమా కలెక్షన్లెంత ముఖ్యమో ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు అంతకన్నా ముఖ్యమైనవి అంటూ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి పేర్కొన్నారు. తాజాగా విదేశీ మీడియా ఐనటువంటి న్యూ యార్క్ టైమ్స్ ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి రాయటం తాను మరచిపోలేననీ, అది మాత్రం హార్ట్ టచింగ్ విషయమని ఒకింత ఉద్వేగానికి గురయ్యారు రాజమౌళి. బాహుబలికి జపాన్ నుండి ప్రశంసలొస్తే... ఆర్ ఆర్ ఆర్ కు అమెరికా నుండి ప్రశంసలు రావటం చాలా ఆనందం గా ఉందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa