నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పాన్ ఇండియా మూవీ 'బీస్ట్'. పూజా హెగ్డే కధానాయిక. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 13 న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. ఇప్పటికే 'బీస్ట్'లోని రెండు పాటలు, 'అరబీ కుత్తు' మరియు 'జొల్లియో జింఖానా' విడుదలయ్యాయి మరియు రెండూ రికార్డ్ బ్రేకింగ్ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. తాజగా ఈ సినిమా నుండి మూడవ సింగిల్ 'బీస్ట్‌మోడ్' లిరికల్ సాంగ్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్ర బృందం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa