ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న 'AK61' షూటింగ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:36 PM

తమిళ స్టార్ హీరో అజిత్, హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన "వాలిమై" సినిమా వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించగా, హ్యూమా ఖురేషి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ అనుకున్నట్టుగానే చెన్నైలో కలెక్షన్లు సాలిడ్ గా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా పెద్దగా వసూలు రాబట్టలేదు. తాజాగా అజిత్, దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకి టెంపరరీగా 'AK61' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా సింపుల్ గా లాంచ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం బ్యాంకు దోపిడీకి సంబంధించినదని, అజిత్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.


తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది అని సమాచారం. ఈ మొదటి షెడ్యూల్‌లో అజిత్ కి సంబంధించిన ప్రధాన సన్నివేశాలను మేకర్స్ షూట్ చేయనున్నారు. ఆగష్టులోపు రెండు షెడ్యూల్‌లతో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2022 దీపావళికి విడుదల కానున్న ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ ని సోనీ సొంతం చేసుకుంది. థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa