బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ "ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయనున్నారు. "ఆదిపురుష్" సినిమా జనవరి 12, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్' లో ఢిల్లీ బ్యూటీ సోనాల్ చౌహాన్ కీలక పాత్రలో కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తాజాగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడుతూ సోనాల్ చౌహాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అవును, నేను ఆదిపురుష్‌లో కనిపించనున్నాను అని చెప్పింది. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa