బాలీవుడ్, హాలీవుడ్ లోనూ మెరిసిన భారత నటి నిమ్రత్ కౌర్. ఆమె ప్రింట్ మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి.. థియేటర్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అనురాగ్ కశ్యప్ నిర్మించిన 'పెడ్లర్స్'లో నటించింది. ఆ తర్వాత 'ది లంచ్ బాక్స్'లో ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి తెరను పంచుకుంది. అమెరికన్ టెలివిజన్ సిరీస్ 'హోమ్యండ్' 4వ సీజన్లో నిమ్రత్ కౌర్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఏజెంట్ పాత్రలో నటించింది. 'ఎయిఫ్ట్'లో అక్షయ్ కుమార్తో కలిసి రొమాన్స్ చేసింది. ఆమె నటించిన ' దాస్వీ' ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ & జియో సినిమా లో స్టీమింగ్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బూ కలర్ చీరలో మెరిసిపోయింది. చీర బాగుంది.. కానీ చీర కంటే అది కట్టుకున్న కౌర్ ఇంకా బాగుందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa