కిరణ్ కొర్పాటి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం 'గని'. అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించిన ఈ మూవీతో హీరోయిన్ గా సాయీ మంజ్రేకర్ తెలుగువారికి పరిచయం అయ్యారు.ఉపేంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, నవీన్ చంద్ర తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ళు వరుణ్ తేజ్ కష్టపడ్డాడు.
అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద బోళ్తా కొట్టింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సైతం అంగీకరించాడు. దీనిపై సోషల్ మీడియా ద్వారా స్పందించిన వరుణ్..ఇన్నేళ్ళుగా నా మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. 'గని' చిత్ర రూపకల్పనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మనసా వాచా మీరంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మరీ ముఖ్యంగా నా నిర్మాతలకు అందుకు ధన్యవాదాలు. ఎంతో మనసు పడి, కష్టపడి ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలని మేమంతా పనిచేశాం అన్నారు.
నేనెప్పుడు సినిమా చేసినా ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే కోరుకుంటాను. కొన్ని సార్లు నేను ఆ విషయంలో విజయం సాధించాను, కొన్నిసార్లు దాని నుండి పాఠాలు నేర్చుకుంటాను. అయితే ఆ ఫలితాలు నేను పడే కష్టంలో ఎలాంటి మార్పు తీసుకురావు అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa