తమిళ స్టార్ హీరో విజయ్, పూజాహెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమా ఈ నెల 13న థియేటర్లలో రిలీజ్ అయింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలయ్యాక ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. మిగిలి రాష్ట్రాలలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం ఈ సినిమా బాగానే ఆడుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాతి రోజే కేజీఎఫ్-2 విడుదలవడంతో 'బీస్ట్' చిత్రంపై ఆ ప్రభావం పడింది. ఇక ఈ సినిమా ఓటీటీలో మే 11న విడుదల అవుతుందని ప్రచారం సాగుతోంది. ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ దక్కించుకున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa