ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య'... మెగా అభిమానులకు కన్నులపండగ - కొరటాల

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:50 AM

ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 తర్వాత తెలుగు ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. టాలీవుడ్ హిట్ మెషిన్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఆచార్య. కెరీర్ పరంగా మెగాస్టార్ కిది 153 వ చిత్రం. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సిద్ధ అనే స్పెషల్ రోల్ చేస్తున్నారు. చరణ్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. అన్వేష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 29 న విడుదల కాబోతుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను ముమ్మరం చేస్తుంది చిత్రబృందం. ఈ మేరకు ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. తాజాగా ఈ మూవీ నుండి భలే భలే బంజారా పాట విడుదలై మెగా అభిమానులను కనురెప్ప వెయ్యకుండా చేసింది. ఇందులో చిరు, చరణ్ ల క్లాస్సి మూవ్మెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 


పోతే... ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ... ఆచార్య మూవీ అభిమానులకు భారీ విజువల్ ట్రీట్ గా ఉండబోతుంది. కీలకమైన కథకు అన్ని హంగులను జోడించి పక్కా కమర్షియల్ గా రూపొందించాం. ఈ మూవీ  అభిమానులకు, సినీ లవర్స్ కు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ముఖ్యంగా సినిమాలో చిరు, చరణ్ ల కాంబోలో వచ్చే సీన్లు ఫ్యాన్స్ కు పండగ లాగా ఉంటుంది. ఇవి సినిమాకే మేజర్ హై లైట్ గా ఉంటాయి.... అని తెలిపారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ కు మెగా అభిమానులు చూపించిన ఆదరణ మాటల్లో చెప్పలేం. ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa