టాలీవుడ్ లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఒక్కటి అని చెప్పొచ్చు. ఈ ప్రొడక్షన్ హౌస్ కాంట్రోవర్సియల్ సబ్జెక్టు అయ్యిన తమ ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేసుకుంది. వివేక్ రంజన్ అగ్నిహోత్రి "ది కాశ్మీర్ ఫైల్స్" అనే టైటిల్ తో ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. కశ్మీర్ లో సాగే ఈ సినిమా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇరుక్కున్న కాశ్మీరీల అంశాలతో ఈ సినిమా వచ్చింది. మార్చి 11న థియేటర్‌లో రిలీజ్ అయ్యిన 'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల మార్కును క్రాస్ చేసింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా OTT విడుదలకి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మే నెలలో ఈ సినిమా ప్రసారానికి ZEE5లో అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలో మూవీ మేకర్స్ ఈ సినిమా OTT విడుదల తేదీని ప్రకటించనున్నారు అని లేటెస్ట్ టాక్. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ అండ్ పల్లవి జోషి ముఖ్యమైన పాత్రలు పోషించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa