బాలీవుడ్ లో టాప్ మోస్ట్ యాక్షన్ డైరెక్టర్స్ లో రోహిత్ శెట్టి ఒక్కరు. ఈ స్టార్ డైరెక్టర్ తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందించాడు. తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. రోహిత్ శెట్టి అమెజాన్ ఒరిజినల్ 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' తో OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. భారతీయ డిజిటల్ స్క్రీన్‌లలో ఈ వెబ్ సిరీస్ అతిపెద్ద యాక్షన్ షో అవుతుంది అని అందరూ అంచనా వేస్తున్నారు. తాజగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయ్యినట్టు సమాచారం. మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి చాలా స్టైలిష్‌గా ఉన్న ప్రోమోను విడుదల చేశారు. ఈ సిరీస్‌లో బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారిగా పోలీసుగా కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa