బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ. గతేడాది విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా పెద్ద హిట్ అయ్యాయి. ముఖ్యంగా జై బాలయ్య అనే పాట మాసివ్ హిట్ అయింది. ఈ పాటతో జై బాలయ్య అనే మాట చాలా పాపులర్ అయ్యింది. ప్రేక్షకులు జై బాలయ్య ను చాలా విరివిగా వాడుతూ దాన్ని ఒక స్లోగన్ గా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పాపులర్ ఐన జై బాలయ్య స్లోగన్ ను ఆదర్శంగా తీసుకుని మహేష్ కొత్త చిత్రం సర్కారువారిపాట లో ఒక పాటను రూపొందిస్తున్నాడు థమన్. బాలకృష్ణ అఖండ, మహేష్ సర్కారువారిపాట ఈ రెండు చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. జై బాలయ్య తరహాలో 'మ మ మ మహేష్' అనే మాస్ పాటను మహేష్ చిత్రం కోసం థమన్ స్వరపరిచాడని టాక్. ఈ పాటకు మహేష్, కీర్తి ఇద్దరూ కలిసి మాస్ స్టెప్పులేస్తూ, థియేటర్లో ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తారని నమ్మకంగా చెప్తున్నారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ పాట రామోజీ ఫిలింసిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. గతంలో చిరంజీవి, నాగార్జున వంటి కొందరు హీరోల పేర్లతో మాత్రమే యూనిక్ టైటిల్ పాటలు రూపొందాయి. తాజాగా మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఇలాంటి ట్రెండ్ కు ఆజ్యం పోస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa