టాలీవుడ్ యువ నటుడు, RX 100 ఫేమ్ కార్తికేయ, డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా ఒక కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహిస్తుండగా, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఈ రోజే స్టార్ట్ చేసారు. ముహూర్తపు సన్నివేశానికి కార్తికేయ భార్య లోహిత కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నిర్మాత సూర్య దేవర నాగవంశీ క్లాప్ నిచ్చారు. ఉప్పెన ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకుడికి స్క్రిప్ట్ నందించారు.
గోదావరి పరిసర ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని, (కామెడీ ప్లస్ డ్రామా) డ్రామెడీ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పక రంజింప జేస్తుందని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. పోతే... ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దివంగత గేయరచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ సినిమాలోని ఒక పాటకు సాహిత్యాన్ని అందించారు. ఇదే ఆయన ఆఖరి పాట కావటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa