ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైన హరీష్ శంకర్ 'ATM'

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 26, 2022, 11:47 AM

చంద్ర మోహన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు హరీష్ శంకర్ ఒక వెబ్ సిరీస్‌ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కి 'ATM' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. హీస్ట్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్నఈ సిరీస్ ZEE5లో ప్రీమియర్ అవుతుంది అని సమాచారం. తాజాగా ఇప్పుడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ వెబ్ సిరీస్ ని లాంచ్ చేసారు. ఈ సిరీస్‌లో విజె సన్నీ మరియు దివి వడ్త్యా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుబ్బరాజు ఈ సిరీస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ రెగ్యులర్ షూట్ ఏప్రిల్ 27, 2022న ప్రారంభమవుతుంది. ప్రశాంత్ ఆర్ విహారి 'ATM' క సంగీతాన్నిఅందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa