విజయ్ దేవరకొండ, సమంత కలిసి జంటగా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే సమంత పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆమెకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తాము నటిస్తున్న సినిమా స్క్రిప్ట్‌లో లేని సీన్‌ని చెప్పి కంటతడి పెట్టుకున్నాడు.. విషయం తెలియని సమంత సీన్‌లో లీనమై భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో విజయ్ ‘హ్యాపీ బర్త్ డే సమంత’ అంటూ ఆమెను ఆశ్చర్యపరిచాడు. అనంతరం దర్శకుడు, సాంకేతిక నిపుణులు సమంతతో కేక్ కట్ చేయించారు. ఈ సర్ ప్రైజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa