ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకుపచ్చ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో మలైకా అరోరా

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 12:15 PM

గ్లామ్, ఫిజిక్, ఫ్యాషన్ వంటి ఏ అంశాలలోనైనా మలైకా అరోరా టాప్​లో ఉంటుంది. తన స్టైల్​తో, ఆకట్టుకునే ఫోజులతో ఫ్యాషన్ ప్రేమికులను ఇట్టే కట్టిపడేస్తుంది. తాజాగా ఈ మున్నీ.. స్లీవ్‌లెస్ సీక్విన్స్ డ్రెస్​లో హాట్​ ఫోజులిచ్చి కుర్రకారు హృదయాల్లో చిచ్చురేపింది. మలైకా అరోరా పొడవాటి ఆకుపచ్చ స్లీవ్‌లెస్ సీక్విన్స్ డ్రెస్‌లో క్రేజీ ఫోజులిచ్చి.. ఇంటర్నెట్​లో హీట్ రేపింది. డిజైనర్ అలీనా అన్వర్ కోచర్ రూపొందించిన డ్రెస్​లో మలైకా మెరిసింది. ఆమె తన రూపాన్ని ఒక జత లేత గోధుమరంగు స్టిలెట్టోస్‌తో జత చేసింది.బీచ్ వేవ్స్ లాంటి కేశాలంకరణ, బ్లష్డ్ చెంపలు, నిగనిగలాడే లేతరంగు లిప్​స్టిక్​తో మేకప్ లుక్​ని ఎంచుకుంది.ఇన్​స్టా గ్రామ్​లోని ఓ పోస్టులో మలైకా అరోరా పొట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించి.. అద్భుతమైన ఫోజులతో అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.మరో ఇన్​స్టాగ్రామ్​ పోస్టులో మలైకా అరోరా రెడ్ ఆఫ్ షోల్డర్ బాడీకాన్ డ్రెస్‌లో బోల్డ్, గ్లామ్ లుక్​లో అభిమానులను ఆకట్టుకుంది.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa