ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 రోజులు పూర్తి చేసుకున్న 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం...

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 09:21 PM

దేశదృష్టిని మొత్తం ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న సినిమా 'ది కాశ్మీర్ ఫైల్స్'. తొంభైలలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశప్రజలకు తెలియని కాశ్మీర్ అంతర్గత విషయాలను ఈ సినిమాతో బహిర్గతం చేశారు వివేక్. దేశ ప్రధాని నరేంద్రమోడీ మెప్పును సైతం ఈ మూవీ పొందడం విశేషం. ఈ సినిమాకు ప్రశంసలు ఎంతలా వచ్చాయో విమర్శలు, నిరసనలు కూడా అదేవిధంగా వెల్లువెత్తాయి. అయితే ఇలాంటివన్నీ ఏమీ పట్టించుకోని ప్రేక్షకులు  ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు. బాలీవుడ్లో దాదాపు 250కోట్ల భారీ కలెక్షన్లతో అక్కడి రికార్డులను తిరగరాస్తుంది. ఈ రోజుతో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా థియేటర్లలో సక్సెసఫుల్ గా యాభై రోజులను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా తెలిపారు. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుందని, ఇది ప్రజల నిజమైన విజయమని దర్శకుడు కామెంట్ చేసారు. పోతే ఈ సినిమాను హైదరాబాద్ కు చెందిన  అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa