ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ లో సెన్సషన్ ని సృష్టిస్తున్న 'గంగూబాయి కతియావాడి' లోని 'ధోలిడా' సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 02:45 PM

సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ నటించిన "గంగూబాయి కతియావాడి" ఫిబ్రవరి 25, 2022న రిలీజ్ అయ్యింది. బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో సీమా పహ్వా, విజయ్ రాజ్, శంతను మహేశ్వరి, ఇందిరా తివారీ, ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, హుమా ఖురేషి అతిధి పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమా స్లో నోట్‌లో ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ ని సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని 'ధోలిడా' సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వీక్షణల ఫీట్‌ను కూడా సాధించింది. అంకిత్ బల్హారా, సంచిత్ బల్హారా మరియు సంజయ్ లీలా బన్సాలీ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa