బాహుబలి 1, 2 సినిమాలతో ప్రభాస్ రేంజ్ భారీగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన మేర రాణించకపోయినా, ప్రభాస్ స్టార్ మేనియా కారణంగా భారీ వసూళ్లను సాధించాయి. ఇక అభిమానులు తమ హీరోలను సింహాలగానూ, పులులగానూ పోలుస్తుంటారు. కొన్ని సినిమాలలో ఆ తరహా సన్నివేశాలను కూడా పెడుతుంటారు. అయితే ఏకంగా ఓ బెంగాల్ టైగర్‌కు జూ అధికారులు ప్రభాస్ పేరు పెట్టారు. ఇతర హీరోలు ఎవరికీ దక్కిన ఘనత ప్రభాస్‌కు దక్కిందని ఆయన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలాజికల్ పార్కులో ఓ రాయల్ టైగర్ బెంగాల్‌కు ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో అక్కడి అధికారులు ఆయన పేరు పెట్టారు. పులి ఉన్న ప్రాంతంలో ఓ బోర్డును ఏర్పాటు చేశారు. అందులోనూ పులి పేరును ప్రభాస్‌గా రాయించారు. దీంతో ఈ ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పెట్టగా విపరీతంగా వైరల్ అయింది. తమ అభిమాన హీరోకు అరుదైన ఘనత దక్కిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa