ప్రముఖ హీరోయిన్, బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తాకు యాక్సిడెంట్ జరిగింది. ఈమె ‘ఆషిక్ బనాయా ఆపనే’, ‘36 చైనా టౌన్’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. మహాకాళ్ దేవాయానికి ఆమె బయల్దేరుతుండగా మార్గం మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ సమయంలోనే ఆమె కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె కాలికి తీవ్రంగా గాయాలవ్వగా చికిత్స చేసి గాయానికి కుట్లు వేశారు. తనకు యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తనూశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఈ హీరోయిన్ తెలుగులో ‘వీరభద్ర సినిమాలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉంది.