ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్ లో #RC15 మూవీ టీం సందడి .... చెర్రీకి అభిమానుల ఘనస్వాగతం...

cinema |  Suryaa Desk  | Published : Wed, May 04, 2022, 10:15 PM

'ఆర్ఆర్ఆర్' తో సూపర్ సక్సెస్ ను అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై మరింత బాధ్యత వహిస్తున్నాడు. ఈ సినిమాతో అన్ని భాషలలో వచ్చిన పాజిటివ్ బజ్ ను అలానే మెయింటైన్ చెయ్యాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు చరణ్. రామ్ చరణ్ కెరీర్లో ఇది 15 వ చిత్రం. RC#15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను పలకరించనున్నాడని టాక్. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టూడెంట్ గా, రాజకీయనాయకుడిగా, ప్రుభుత్వోద్యోగిగా, సామాన్యుడిగా నాలుగు విభిన్నమైన పాత్రలను చరణ్ పోషిస్తున్నట్టు తెలుస్తుంది. 


ఇటీవలనే పంజాబ్ షెడ్యూల్ ని పూర్తి  చేసిన #RC15 చిత్రయూనిట్ తాజాగా వైజాగ్ లో చిత్రీకరణ జరపనున్నారు. ఈ మేరకు వైజాగ్ ఎయిర్ పోర్టులో దిగిన రామ్ చరణ్ కు మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆయనతో ఫోటోలు దిగటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద కొంతసేపు కోలాహలం ఏర్పడింది. ఈ సినిమా శంకర్ కు తొలి తెలుగు సినిమా కాగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఈ సినిమాని దింపాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వినయవిధేయరామ తరువాత కియారా అద్వానీ మరో సారి ఈ సినిమాలో చరణ్ తో జతకట్టనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa