ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ 2 కలెక్షన్లలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. రాకింగ్ స్టార్ యష్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. గత రెండు వారాలు మంచి కలెక్షన్లు వచ్చాయి. కొత్త సినిమాల రాకతో మూడో వారంలో కేజీఎఫ్ 2 కలెక్షన్లు తగ్గుతాయని అనుకున్నారంతా. కానీ రాఖీభాయ్ హవాకి ఏ సినిమా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 మూడవ వారంలో రూ. 20.77 కోట్లను కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో, ఆల్ టైం హయ్యెస్ట్ థర్డ్ వీక్ గ్రాసర్ లో కేజీఎఫ్ 2 పదవ స్థానంలో చేరి రికార్డ్ సృష్టించింది. కేజీఎఫ్ 2 కన్నా ముందు ఈ లిస్టులో బాహుబలి 2(42.55cr), దంగల్(31.79cr ), తానాజీ (27.48cr), పీకే (26.75cr), ఉరి (23.54cr), RRR (23cr), కబీర్ సింగ్ (22.52cr), సంజు (21.46cr), ది కాశ్మీర్ ఫైల్స్ (20. 85cr) చిత్రాలున్నాయి. కేజీఎఫ్ 2 చిత్రం బాలీవుడ్ లో ఇప్పటివరకు రూ. 382.90 కోట్లను వసూలు చేసింది. త్వరలోనే రూ. 400 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa