సూర్య వనగల దర్శకత్వంలో చెన్నై తెండ్రాల్ త్రిష తెలుగులో ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సిరీస్ కి 'బృందా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్న సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ త్రిష కృష్ణన్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించింది. ఈ సినిమాకి 'ది రోడ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ ఖరారు చేశారు. అరుణ్ వసీగరన్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మూవీ మేకర్స్ రివీల్ చేసారు. ది రోడ్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్‌గా పేరు ఉన్న షబీర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత అందిస్తున్నారు. AAA ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa