ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య-బాల సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 01:05 PM

దర్శకుడు బాలాతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి టెంపరరీగా 'సూర్య 41' అని పేరు పెట్టారు. తాజాగా  కన్యాకుమారిలో 34 రోజుల పాటు సాగే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూన్‌లో గోవాలో 15 రోజుల రెండో షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో సూర్య డబల్ రోల్ లో కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ పాండియన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన కృతి శెట్టి జంటగా నటిస్తుంది. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అండ్ 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa