ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలీవుడ్ సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా 'కేజీఎఫ్ 2' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Thu, May 05, 2022, 11:30 PM

ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ 2 కలెక్షన్లలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతోంది. రాకింగ్ స్టార్ యష్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.  ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి మరెన్నో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న కేజీఎఫ్ 2 చిత్రం ఇటీవలనే వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరింది. విడుదలై రెండు వారాలు గడుస్తున్నా కేజీఎఫ్ 2 థియేటర్ల వద్ద రష్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉత్తరాది థియేటర్లలో రద్దీ మాములుగా లేదు. దీంతో ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ దూసుకుపోతుంది. తాజాగా కేజీఎఫ్ 2 చిత్రం మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాప్ సెకండ్ గ్రాసర్ గా ఉన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ దంగల్ చిత్రాన్ని అధిగమించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా బుధవారం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 8.75 కోట్లకు పైగా వసూలు చెయ్యటంతో మొత్తం రూ. 391 కోట్ల కలెక్షన్లతో దంగల్ సినిమా స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటివరకున్న పెద్ద సినిమాల రికార్డులన్నీ తుడిచిపెడుతున్న కేజీఎఫ్ 2 ఖాతాలో మిగిలున్న మరో పెద్ద సినిమా బాహుబలి 2. ఇక దీన్ని కూడా కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తే కేజీఎఫ్ 2 చిత్రం భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa