రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సినిమాలను తీయటంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ లేడీ లవ్ కనిపించనుంది. ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకూడా అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకి 'సీత రామం' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో సుమంత్ అక్కినేని కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మే 9వ తేదీన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ 'ఓ సీతా హే రామా' ని విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని విడుదల చేసారు. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa