ఆనంద్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తన 28వ సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఒక క్రేజీ టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా ఈరోజు సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసారు. అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల చేసారు. ఈ సినిమాకి 'ఊరు పేరు భైరవకోన' అనే టైటిల్ ని లాక్ చేసారు. కావ్య థాపర్ మరియు వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీత అందిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa