సందీప్ కిషన్ త్వలరో 'మైఖేల్' గా వెండితెరపైకి రానున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. ఒక వైపున నిర్మాతగాను .. మరో వైపున హీరోగాను ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. 'గల్లీరౌడీ' ఫరవాలేదని అనిపించుకున్నప్పటికీ ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా లేదు. ఈ నేపథ్యంలోనే 'మైఖేల్' గా పలకరించడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
శ్రీనివాస సినిమాస్ వారు నిర్మించిన ఈ సినిమాకి రంజిత్ జైకోడి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫస్టు లుక్ ను రిలీజ్ చేశారు. సిక్స్ ప్యాక్ తో పూర్తిగా యాక్షన్ లోకి దిగిపోయినట్టుగా చేతిలో గన్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో సందీప్ జోడీగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. 'మజిలీ' .. 'రామారావు ఆన్ డ్యూటీ' తరువాత ఈ బ్యూటీ చేసిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. చాలా పవర్ఫుల్ గా కనిపించే ఈ పాత్రల్లో విజయ్ సేతుపతి .. గౌతమ్ మీనన్ .. వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa