టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదలకావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా రానా, సాయి పల్లవి లాంటి ఫ్రెష్ కాంబో పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
తాజాగా ఈ మూవీ నుండి సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్రను పరిచయం చేస్తూ ఒక వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ రోజు సాయి పల్లవి పుట్టినరోజు సందర్భంగా, విరాట పర్వం చిత్రబృందం వెండితెర వెన్నెల కు జన్మదిన శుభాకాంక్షలు ... అంటూ విడుదల చేసిన ఈ స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వెన్నెల రెండు సార్లు పుట్టింది , ఒకసారి అడవితల్లి ఒడిలో మరోసారి, ఆశయాన్ని ఆయుధం చేసిన అతని ప్రేమలో అంటూ సాగిన ఈ వీడియో సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని జూలై 1న విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం ఇటీవలనే అధికారిక ప్రకటన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa