టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేష్ 59 వ చిత్రం గా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమా తెరకెక్కుతుంది. వరస ఫ్లాప్ ల తర్వాత ఇటీవలే నాంది చిత్రంతో హిట్ ట్రాక్ లోకొచ్చిన అల్లరి నరేష్ ఈ సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నాడు. హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని ఏఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. దేనివైపో దీర్ఘంగా చూస్తూ, మంచాన్ని తన భుజంపై మోసుకెళ్తున్న నరేష్ లుక్ ఆసక్తిని కలిగిస్తుంది. ఇది కూడా నాంది సినిమాలాగానే కథ ప్రాధాన్యమున్న చిత్రంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే మరో చిత్రం లో కూడా నటిస్తున్నారు. అది కూడా షూటింగ్ దశలోనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa