తెలుగు ప్రేక్షకులకి సుమ కనకాల గురించి పరిచయం అవసరం లేదు. ప్రముఖ హోస్ట్, యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రామ్ తెలుగు టెలివిజన్ లో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ గేమ్ షోలలో ఒకటి. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌తో ఈ షో 200 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 'ఎఫ్3' మూవీ టీమ్ ని గెస్ట్స్ గా ఈ గేమ్ షోకి ఆహ్వానించారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, సునీల్, సోనాల్ చౌహాన్ మరియు అనిల్ రావిపూడి ఈ షోకి హాజరయ్యారు. మల్లెమాల తాజాగా ఈ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోకి యూట్యూబ్ లో విడుదల చేసిన తక్కువ టైమ్ లోనే 1 మిలియన్ కంటే ఎక్కువ వీక్షణలను 37K కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించింది. ఈ లేటెస్ట్ ఎపిసోడ్ మే 14, 2022న రాత్రి 09:30 గంటలకు ETVలో ప్రసారం చేయబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa