ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 16న 777చార్లీ మూవీ ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 01:27 PM

అతడే శ్రీమన్నారాయణ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ శెట్టి చేస్తున్న మరో విభిన్నమైన చిత్రానికి తెలుగులో దగ్గుబాటి రాణా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ జూన్ 10వ తేదీన విడుదల కాబోతుంది. కిరణ్ రాజ్ దర్శకత్వంలో కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని జి.ఎస్ గుప్తా తో కలిసి రక్షిత్ శెట్టి నిర్మించారు. ఈ సినిమాను మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో కార్తిక్ సుబ్బరాజ్ సమర్పిస్తున్నారు.  


తాజాగా ఈ మూవీ నుండి రక్షిత్ శెట్టి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ ను మే 16న, 12.12 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపే ఒక స్పెషల్ పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతా లో పోస్ట్ చేసాడు. ఈ మూవీ కథ మొత్తం ఒక కుక్కపిల్ల చుట్టూ తిరుగుతుంది. ఆ కుక్కపిల్లకు, రక్షిత్ కు మధ్య ఏర్పడిన బంధాన్ని ఈ సినిమాలో ఎంతో హృద్యంగా చూపించారని చిత్రబృందం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa