ప్రఖ్యాత మేగజీన్ లలో మన ఫోటో వస్తే ఆ ఆనందం మామూలుగా ఉండదు. సర్కారు వారి పాట చిత్రం ప్రమోషన్స్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుండగా... సోమవారం 'ద పీకాక్' మేగజీన్ కవర్ పేజీపై మహేశ్ బాబు కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ద పీకాక్ మేగజీన్ కవర్ పేజీపై తాను ఉన్న ఫొటోను స్వయంగా మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మేగజీన్ కవర్ పేజీపై తన ఫొటోను ప్రచురించిన ద పీకాక్ మేగజీన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫొటో కోసం జరిగిన షూట్ మొత్తం ఉల్లాసంగా గడిచిందని పేర్కొన్న మహేశ్.. ఆ షూట్ కోసం కష్టపడ్డ ద పీకాక్ మేగజీన్ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు కూడా మహేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa